మూడు వరుస చోరీలు.. దొరికిన కాడికి దోచింది
చివరికి కటకటాల పాలైన మహిళ దొంగ
ఎల్లారెడ్డి, మే 14 : వరుసగా ఆ గ్రామంలో మూడు ఇళ్లల్లో పథకం ప్రకారం దొంగతనం చేసి చివరకు పోలీసులకు దొరికి కటకటాల పాలైన మహిళ దొంగ ఉదంతమీది. కామారెడ్డి జిల్లాఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో బుధవారం నిర్వహించిన మహిళ దొంగ వివరాల ను సీఐ రవీందర్ నాయక్ వెల్లడించారు. ఎస్‌ఐ మహేష్. ఎల్లారెడ్డి సిఐ రవీందర్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం, ఎల్లారెడ్డి మండలంలోని, సాతెల్లి గ్రామానికి, చెందిన మహిళగా గుర్తించారు.
ఎల్లారెడ్డిపోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైం నెంబర్లు 66/2025, 97/2025, 98/2025 కేసులలో దొంగతనాలకు సంబంధించి ప్రధాన నిందితురాలిగా సాతెల్లి గ్రామానికి చెందిన నీరడి మంజుల ెుల్లారెడ్డి పట్టణంలోని డైలీ మార్కెట్ సమీపంలో దొంగతనానికి సంబంధించిన ఆభరణాలు అమ్మేందుకు వచ్చిన సమయంలో పోలీసులు నిందితురాలపై ప్రత్యేక నిఘా దాల్చి మహిళ దొంగను, పట్టుకున్నట్లు ఎల్లారెడ్డి సిఐ రవీందర్ నాయక్, ఎస్‌ఐ మహేష్ తెలిపారు.
గ్రామస్తుల, నమ్మదగిన సమాచారం మేరకు నిందితురాలిని అరెస్ట్ చేసి, పంచాయితీ సభ్యుల సమక్షంలో విచారణ చేయగా, సాతెల్లి గ్రామంలో జరిగిన క్రింది మూడు దొంగతనాలను, నేరుగా తానే చేసినట్లు ఒప్పుకుందని ఎల్లారెడ్డి సిఐ, రవీందర్ నాయక్ అన్నారు. గత నెల మూడు న ఫిర్యాదుదారు పసుపుల అనిత దేవుడికి మొక్కు కోసం యాదగిరిగుట్ట వెళ్లిన సమయంలో, ఆమె ఇంట్లో ఉన్న బంగారు కమ్మలు,ముక్కుపుడక ఈ నెల 9 న చోరీకి గురయ్యాయి.
ఫిర్యాదుదారు దుద్దుల దుర్గయ్య ఇంట్లో ఐదు తులాల వెండి కడియం మరియు రూ.10,000 నగదు చోరీకి గురయ్యాయి. ఈ నెల 9న ఫిర్యాదుదారు మంగలి కిషన్ ఇంట్లో 20 తులాల వెండి పట్టీలు, ఒక జత బంగారు చెవి కమ్మలు, రూ.13,000 నగదు దొంగతనానికి గురైనట్లు,ఈ కేసుల దర్యాప్తులో భాగంగా నిందితురాలినుంచి ఒక జత బంగారు కమ్మలు,20 తులాల వెండి పట్టీలు,ఐదు తులాల వెండి కడియం,రూ.12,000 నగదుస్వాధీనం చేసుకోవడం జరిగిందని సీఐ తెలిపారు.
నిందితురాలిని వెంటనే అరెస్ట్ చేసి, న్యాయస్థానానికి హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్లు సిఐ రవీందర్ నాయక్ తెలిపారు. ఈ కేసును దర్యాప్తు చేసి, నిందితురాలిని పట్టుకోవడం లో చాకచక్యంతో పనిచేసిన ఎల్లారెడ్డి పట్టణ ఎస్సు మహేష్, కానిస్టేబుల్ ఇద్రిస్, హోంగార్డు ప్రసాద్ ను ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.






