calender_icon.png 16 May, 2025 | 12:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

15-05-2025 12:28:48 AM

కామారెడ్డి,  మే 14 (విజయక్రాంతి) : కామారెడ్డి జిల్లా దోమ కొండ మండలం లింగుపల్లి గ్రామ శివారులో బుధవారం ఒక గుర్తు తెలియని శవం లభ్యమైనట్లు దోమకొండ ఎస్సు స్రవంతి తెలిపారు. బుధవారం లింగుపల్లి దోమకొండ మధ్యలో శివారులో ఒక గుర్తు తెలియని మృతదేహం వయసు 32 నుండి 40 సంవత్సరాల లోపు పురుషుడు శవం లభ్యమైనట్లు తెలిపారు.

మృతుడిపై బ్లూ కలర్ శాలువా ఉన్నట్లు తెలిపారు. మృతుడు ఎవరు? ఎలా మరణించాడు? అనే కోణంతో పాటు మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి వివరాలు తెలుసుకొని వెల్లడిస్తామని ఆమె తెలిపారు. ఎవరైనా ఈ వ్యక్తిని గుర్తిస్తే దోమకొండ పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఫోన్ నెంబర్ 8712 686156, 8712 6861 53 నెంబర్లకు ఫోన్ చేసి సంప్రదించగలరనీ దోమకొండ ఎస్ ఐ స్రవంతి తెలిపారు.