calender_icon.png 11 July, 2025 | 1:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ బీసీ నేతల సమావేశం

11-07-2025 08:57:24 AM

హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి(Bharat Rashtra Samithi ) పార్టీ బీసీ నేతలు శుక్రవారం నాడు తెలంగాణ భవన్(Telangana Bhavan)లో సమావేశం కానున్నారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ నిర్ణయం దృష్ట్యా ఈ సమావేశం కొనసాగనుంది. తదుపరి కార్యాచరణపై బీఆర్ఎస్ బీసీ నేతలు(BRS BC leaders) చర్చించనున్నారు. బీసీలకు కాంగ్రెస్‌ ఘరానా మోసం చేస్తుందని, రాష్ట్రపతికి బిల్లును పంపి.. రాష్ట్రంలో ఆర్డినెన్స్‌ డ్రామా అడుతోందని బీఆర్ఎస్ ఆరోపించింది.

కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు(BC Reservations) 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddyఅధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం తీర్మానించింది. ఇందుకు సంబంధించి ఆర్డినెన్స్‌ను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు ఖరారు చేయాలన్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ అంశంపై ముఖ్యమంత్రి అధ్యక్షతన డా. బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశం(Telangana Cabinet Meeting) చర్చించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానించింది. విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గత మార్చి నెలలో జరిగిన సమావేశాల్లో బిల్లులకు శాసనసభ ఆమోదించి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి నివేదించిన విషయం తెలిసిందే.