11-07-2025 03:01:12 PM
గీత పనివారల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తొట్ల ప్రభాకర్ గౌడ్
నూతనకల్,(విజయక్రాంతి): మండల పరిధిలోని మిర్యాల గ్రామానికి చెందిన అనంతుల లింగయ్య(47) గురువారం రాత్రి తాడిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడడంతో తీవ్ర గాయాలు కాగా సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి(Suryapet Area Hospital) తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు మృతుని కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎక్స్ గ్రేషియా చెల్లించాలని గీతా పనివారల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తొట్ల ప్రభాకర్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు అనంతరం మృతుని కుటుంబాలను పరామర్శించారు.