11-07-2025 01:43:56 PM
హైదరాబాద్: మెదక్ జిల్లా(Medak District) అంసాన్ పల్లి కల్లు డిపోలో(Kallu Depot) వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కల్లు మత్తులో సీసాతో దాడి చేసి ఓ తమ్ముడు అన్నను హత్య చేశాడు. అందరూ చూస్తుండగానే అన్న మంత్యను మోహన్ కొట్టి చంపాడు. భూతగాదాలు, అప్పుల విషయంలో సోదరుల మధ్య ఘర్షణ జరుగుతోంది. హత్య చేసిన అనంతరం తమ్ముడు మోహన్ పోలీసులు ఎదుట లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.