calender_icon.png 11 July, 2025 | 7:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో 95 లక్షల రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం

11-07-2025 02:09:00 PM

భారీ నీటిపారుదల, పౌరా సరఫరాల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి

తుంగతుర్తి,(విజయక్రాంతి): భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో(Telangana State) 3 కోట్ల 10 లక్షల మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డు పంపిణీ(Ration Cards) ద్వారా సన్న బియ్యం పంపిణీ జరుగుతున్నట్లు భారీ నీటిపారుదల పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy ) అన్నారు. శుక్రవారం తిరుమలగిరి మండల కేంద్రంలో ఈనెల 14న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం సభా స్థలాన్ని పరిశీలించి మాట్లాడారు. దేశంలో బీసీల కులగనన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేనిని అన్నారు. గడచిన పది సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరికి రేషన్ కార్డు పంపిణీ చేయలేదని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. 

నియోజకవర్గంలో ఎందరో మహానుభావులు పుట్టిన గడ్డ మనీ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయుటకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం బీసీ,ఎస్టీ సంక్షేమ శాఖ ఇన్చార్జి జిల్లా మంత్రి అడ్డూరి లక్ష్మణ్ మాట్లాడుతూ... కష్టపడే కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని అన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే సామాజిక న్యాయం చేకూరుస్తుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఐకమధ్యమతో పనిచేసి బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. 

కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ , డిసిసి అధ్యక్షులు రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ ,ఫైనాన్స్ కమిషన్ సభ్యులు సంకేపల్లి సుధీర్ రెడ్డి, సంజీవరెడ్డి జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ,పిసిసి సభ్యులు గుడిపాటి నరసయ్య, డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, మండల శాఖ అధ్యక్షుడు గ్రామ శాఖ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నారు పవర్, జిల్లా ఎస్పీ నరసింహం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.