calender_icon.png 11 July, 2025 | 8:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద విద్యార్థులకు దాతల చేయూత

11-07-2025 02:01:19 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ మున్సిపాలిటీ(Mahabubabad Municipality) పరిధిలోని కృష్ణాపూర్ తండా (ఏటిగడ్డ తండా) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్థానిక రాజ్యలక్ష్మి డ్రెస్సెస్ రవి, మైస శ్రీనివాస్, తోడేటి వెంకన్న సహకారంతో దుస్తులు, నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, ఇతర సామాగ్రి అందించారు. ఈ సందర్భంగా టి పి టి ఎఫ్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు మాట్లాడుతూ ఏటిగడ్డ తండా పాఠశాలలో టీచర్ మాధవి, చెన్నై ప్రాంతం నుంచి వలస వచ్చిన విద్యార్థులను బడిలో చేర్పించి చదువు చెప్పడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

నిరుపేదలైన వారికి కొంత చేయూతని ఇవ్వాలనే ఉద్దేశంతో చదువుకోడానికి అవసరమైన కొన్ని వస్తువులు అందజేశామన్నారు. తండా వాసులు ఇక్కడ బడిని బ్రతికించుకోవడానికి కృషి చేయాలని, వారి పిల్లల్ని పాఠశాలలో చేర్పించాలని కోరారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాధవి మాట్లాడుతూ పేద విద్యార్థులకు దుస్తులు, నోటు పుస్తకాలు, పెన్నులు పెన్సిళ్లు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లక్ష్మీ, పాఠశాల హెడ్మాస్టర్ మాధవి సీఆర్పి అరుణ, దేవ్ సింగ్, రాంబాబు, కిషన్, జానీ, ఎస్ఎఫ్ఐ  నాయకులు సింహాద్రి పాల్గొన్నారు.