శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం
తిరుమల తిరుపతి దేవస్థానంలో శుక్రవారం (Tirumala Tirupati Devasthanam) భక్తుల రద్దీ కొనసాగుతుంది. తిరుమల పుణ్యక్షేత్రంలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి(Srivari Sarva Darshan) 20 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు ప్రకటించారు. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులతో అన్ని కంపార్టు మెంట్లు నిండిపోయాయి.కంపార్టు మెంట్లన్నీ నిండి భక్తులు శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. 63,473 మంది భక్తులు గురువారం శ్రీవారిని దర్శించుకున్నారు. 27,796 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.54 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు(TTD officials) వెల్లడించారు. నిన్న గురుపూర్ణిమ (వ్యాస పూర్ణిమ) పవిత్ర సందర్భంగా తిరుమలలో దివ్య గరుడసేవ వైభవంగా జరిగింది. శ్రీ మలయప్ప స్వామి గరుడ వాహనంపై నాలుగు మాడ వీధుల్లో శోభాయమానంగా ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.







