11-07-2025 02:03:24 PM
లూస్ లైన్ లకు మరమ్మాత్తు పనులు.
విద్యుత్ మీటర్లకు సీల్ వేయాలని ఆదేశం.
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా విద్యుత్ శాఖ(Nagarkurnool District Electricity Department) అధికారి ఎస్ఇ కె.వెంకట నర్సింహా రెడ్డి జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో శుక్రవారం ఆకస్మికంగా తనికీలు చేపట్టారు. జిల్లా కేంద్రంలోని రామాలయం వీధి, నాగనూలు రోడ్డులోని గంధం బావి వద్ద ప్రమాదకర స్థాయిలో ఉన్న లూస్ లైన్ పరిశీలించారు. హౌసింగ్ బోర్డు నుండి ఎర్రగడ్డ కాలనీ, టీచర్స్ కాలనీ, శ్రీనగర్ కాలనీ, వినోబా నగర్ వంటి ప్రాంతాల మీదుగా గతంలో ఇల్లు లేని సమయంలో ఏర్పాటు చేసిన 11కెవి లైన్ ప్రస్తుతం ఇళ్ల మధ్యలో ప్రమాదకర స్థితికి మారింది.
ఈ పరిస్థితిలో వాటిని మార్చేందుకు ఎన్నో ఏళ్లుగా వినియోగదారులు సామాన్యులు అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కారానికి నీచుకోలేదు. ఈ విషయాన్ని గుర్తించి శుక్రవారం ఆ లైన్ పరిసరాలను పరిశీలించారు. అక్కడక్కడ వేలాడుతున్న విద్యుత్ తీగలను పరిశీలించి వెంటనే సరి చేయాలని అధికారులను ఆదేశించారు. గృహ వినియోగదారులు వాడుతున్న విద్యుత్ మీటర్లకు సీల్ ఓపెన్ చేసి ఉండడాన్ని గుర్తించి సంబంధిత విద్యుత్ ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జిల్లాలోని అన్ని మీటర్లకు సీల్ బిగించాలని ఆదేశించారు. వారి వెంట డిఈ ఆపరేషన్ శ్రీధర్శెట్టి, టెక్నికల్ డిఇ రవికుమార్, విద్యుత్ ఉద్యోగులు రామచందర్ నాయక్, శ్రీనివాస్ గౌడ్, రమేష్ అన్నారు.