calender_icon.png 3 December, 2025 | 5:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ అభ్యర్థులు ధైర్యంగా ఉండాలి

03-12-2025 12:00:00 AM

* మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి

రామాయంపేట, డిసెంబర్ 2 :స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్‌ఎస్ అభ్యర్థులు ధైర్యంగా ఉండాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే, బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి సూచించారు. అధికార పార్టీ పలు ప్రలోభాలకు గురిచేసి వేరే వారు గెలవకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.

రాజ్యాంగ పద్ధతిలో ఎన్నికలు జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మెదక్ జిల్లాతో పాటు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ కు బలమైన క్యాడర్ ఉందని ఆమె గుర్తు చేశారు. ఈ విషయంలో అభ్యర్థులు కూడా ధైర్యంగా ఉండి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

నిజాంపేట సర్పంచ్ అభ్యర్థిగా శ్రీకాంత్ ను నామినేషన్ వేయించడం జరుగుతుందని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేసి తగిన ప్రాధాన్యత రాకపోవడం వల్ల చాలామంది అసంతృప్తితో బీఆర్‌ఎస్ పార్టీ వైపు చూస్తున్నారని ఆమె గుర్తు చేశారు.