03-12-2025 12:00:00 AM
నారాయణపేట, డిసెంబర్ 2 (విజయక్రాంతి) : జిల్లాలో రెండో విడత ఎన్నికలు జరిగే నామినేషన్ కేంద్రాలను మంగళ వారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. నారాయణ పేట మండలం చిన్నజ ట్రo, ధన్వాడ, మరికల్ మండల కేంద్రాల్లోని నామినేషన్ కేంద్రాలను ఆమె పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని, అభ్యర్థులు నామినేషన్ ఫారాలు నింపే సమయంలో ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయాలని కలెక్టర్ సూచించారు.