1 June, 2026 | 12:03 PM

Breaking News

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై తెలంగాణ CID బిగ్ ఆపరేషన్.. 11 మంది అరెస్ట్   •   బిగ్ షాక్... మరోసారి పెరిగిన సిలిండర్ ధరలు.. ఎంతంటే?   •   సీఎం పర్యటన బందోబస్తుపై పోలీసు అధికారులకు ఎస్పీ నితికా పంత్ బ్రీఫింగ్   •   రామేశ్వరం కోనేరులో పడి మహిళ మృతి   •   ఆర్యవైశ్య మహాసభ పట్టణ అధ్యక్షుడిగా బిల్లకంటి హరిబాబు గెలుపు   •   సింగరేణిలో మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహణ   •   భద్రాచలంలో విలేకరుల ముసుగులో అక్రమదందా   •   కేసీఆర్‌తో ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి భేటీ   •   జాగరి గట్టమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించిన మాజీ జడ్పీటీసీ సదానందం   •   హైదరాబాద్‌లో అవార్డు అందుకున్న ఆదివాసి బిడ్డ   •  

నీతి, నిజాయితికి పట్టం కట్టారు

12-04-2026 12:26 PM

- మాజీ ఎంఎల్ఏ పుట్ట మధు

మంచిర్యాల,(విజయక్రాంతి): క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికలలో మున్సిపాలిటీ ప్రజలు నీతికి, నిజాయితీకి పట్టం కట్టారని మాజీ ఎంఎల్ఏ పుట్ట మధు పేర్కొన్నారు. ఆది వారం క్యాతనపల్లిలోని మాజీ ఎంఎల్ఏ బాల్క సుమన్ నివాసంలో ఇటీవల విజయం సాధించిన బీఆర్ఎస్ కౌన్సిలర్లను, చైర్మన్ అభ్యర్థిని సన్మానించిన అనంతరం ఆయన మాట్లాడారు. రెండున్నరేండ్లలో కాంగ్రెస్ పాలనను చూసి విసిగి పోయిన ప్రజలు మార్పును కోరుతున్నారనడానికి ఇదే నిదర్శనమన్నారు. వేల కోట్లు ఉన్న చెన్నూర్ నియోజక వర్గ ఎంఎల్ఏ డబ్బుతో అందరిని కొనచ్చని చూసినా, లొంగకుండా ప్రజలు, పార్టీ మద్దతుతో విజయం సాధించిన బీఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లు నిజాయితీగా నిలబడి క్యాతనపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారని అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ సంధ్యా రాణి, బిఆర్ఎస్ నాయకులు రాజా రమేష్ తదితరులు పాల్గొన్నారు.