21 July, 2026 | 6:00 PM

బిగ్ షాక్... మరోసారి పెరిగిన సిలిండర్ ధరలు.. ఎంతంటే?

01-06-2026 11:25 AM

మరోసారి పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర

డొమెస్టిక్ సిలిండర్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేదు

న్యూఢిల్లీ:  కమర్షియల్ సిలిండర్(Commercial LPG) పై కేంద్రం షాక్ ఇచ్చింది. హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగించే వాణిజ్య LPG ధరలను(Commercial LPG Prices) సోమవారం నాడు 19 కిలోల సిలిండర్‌పై రూ. 42 మేర పెంచారు. పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి.  ఢిల్లీలో వాణిజ్య ఎల్‌పిజి ధర, 19 కిలోల సిలిండర్‌కు రూ. 3,071.50 నుండి రూ. 3,113.50కి పెరిగిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

దేశవ్యాప్తంగా తాజా ఆర్థిక వార్తల కోసం మా విజయక్రాంతి న్యూస్ హోమ్‌పేజీని సందర్శించండి.

గృహ వంటశాలల్లో వినియోగించే 14.2 కిలోల దేశీయ LPG సిలిండర్ ధరలు రూ. 913 వద్ద యథాతథంగా కొనసాగాయి. హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్‌ ధర రూ.3,367 చేరింది.   కమర్షియల్ సిలిండర్‌ ధర హైదరాబాద్‌లో రూ.52 పెరిగింది. 5 కేజీల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్‌ పైన రూ.11 పెరిగింది. అయితే, గృహ వంటశాలల్లో ఉపయోగించే వంట గ్యాస్ ధరలలో మాత్రం ఎటువంటి మార్పూ లేదని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఈ ధరల పెంపుతో హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారులపై అదనపు భారం పడనుంది. గ్యాస్ ధరల పెంపుపై వ్యాపార వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఆర్థిక, మార్కెట్ పరిణామాల కోసం మా బిజినెస్ వార్తలు చదవండి

ప్రశ్న: LPG ధరలు పెరిగాయా?
జవాబు: అవును, కమర్షియల్ LPG ధరలు రూ.42 పెరిగాయి. కానీ గృహ వంట గ్యాస్ ధరల్లో మార్పు లేదు.

ఇలాంటి బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా లేటెస్ట్ న్యూస్ సెక్షన్‌ను ఫాలో అవ్వండి.

FAQ's

1. కమర్షియల్ LPG ధర ఎంత పెరిగింది?

రూ.42 మేర పెరిగింది.


2. గృహ LPG ధరల్లో మార్పు ఉందా?

లేదు, గృహ వంట గ్యాస్ ధరలు యథాతథంగా ఉన్నాయి.


3. హైదరాబాద్‌లో ధర ఎంత?

కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,367కు చేరింది.


4. ఎవరికీ ఎక్కువ ప్రభావం?

హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారులకు ఎక్కువ భారం పడుతుంది.