99 రోజులు.. 10 థీమ్‌లు
ఐదు దశల్లో యాక్షన్ ప్లాన్
- 6న ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మంత్రుల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం
- కార్యక్రమం పర్యవేక్షణకు ప్రత్యేక మొబైల్ యాప్
- ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు వివరించాలి
- వార్డు మెంబర్ నుంచి మేయర్ల వరకు ప్రగతి ప్రణాళికలో భాగస్వామ్యం చేయాలి: కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 3 (విజయక్రాంతి) : 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికను ఐదు దశల్లో నిర్వహించాలని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ నెల 6న ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మంత్రుల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు నిర్వహించాలని, 99 రోజుల్లో శాఖల వారీగా పది థీమ్‌లతో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలి పారు.
ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమ పర్యవేక్షణకు ప్రత్యేక మొబైల్ యాప్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 6 నుంచి జూన్ 12వ తేదీ వరకు 99 రోజుల ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంపై మంగళవారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్‌రెడ్డి సదస్సు నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు పనిచేయాలని సూచించారు.
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని, గ్రామ సభల్లో సంక్షేమ పథకాల వారీగా ప్రభు త్వం చేకూరుస్తున్న లబ్ధిని ప్రజలకు వివరించాలని కలెక్టర్లకు ఆదేశించారు. 99 రోజుల ప్రణాళిక కార్యక్రమానికి సంబంధించి పలు సూచనలు చేశారు. కలెక్టర్లు తమ తమ జిల్లాల్లో పంటల వైవిధ్యతకు ఉన్న అవకాశాలపై నివేదిక సమర్పించాలని సీఎం ఆదే శించారు.
సీఎం కీలక సూచనలు..
* వార్డు సభ్యులు, సర్పంచ్‌లు, మున్సిపల్ వార్డు సభ్యులు, చైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లను భాగస్వాములను చేయాలని సూచించారు. వార్డు సభ్యులు, సర్పంచు లు, చైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లు అం దరికీ జిల్లా కేంద్రాల్లో ఒక రోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి.. వారి విధు లు, బాధ్యతలకు సంబంధించి అవగాహ న కల్పించడంతో పాటు ప్రింటెడ్ మెటీరియల్ వారికి అందించాలన్నారు.
* సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలి. వ్యవసాయ పంప్ సెట్లకు బదులు సోలార్ పంప్ సెట్ వినియోగం పై రైతులకు అవగాహన కల్పించాలి.. సోలార్ మోటార్లతో కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించాలి. ఇళ్లపైన సో లార్ ప్లాంట్లు అమర్చుకోవడం.. సోలార్ విద్యుత్ వాడుకోవటంతో పాటు గ్రిడ్ కు కనెక్ట్ చేయడం ద్వారా వచ్చే ఆదాయంపై అన్ని గ్రామాల్లో విద్యుత్ శాఖ అవగాహన కల్పించాలి.
* గ్రామ, వార్డు సభల్లో నూతనంగా ఇచ్చి న రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200లోపు యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ లబ్ధిదారుల వివరాలు తెలియజేయాలి. వాటితో గ్రామ, మండల, నియోజకవ ర్గం, జిల్లా స్థాయి కలిగిన లబ్ధిని ప్రజలకు వెల్లడించాలి.
* రాష్ట్రంలో ఉన్న 35 ప్రభుత్వ మెడికల్ కళాశాలల సేవలు ప్రజలకు అందేలా చూడాలి. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఇత ర స్థానిక వైద్య సంస్థలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలకే రిఫర్ చేయాలి. మెడిక ల్ కళాశాలల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలు, వైద్య విద్యార్థులు, వైద్యులు, ప్రొఫెసర్లు ఉన్నా రు.. వారి సేవలు సద్వినియోగం చేసుకోవాలి.
Fప్రతి ప్రభుత్వ పథకం లబ్ధిదారుల ముఖ గుర్తింపు (ఫేషియల్ రికగ్నైజేషన్) చేపట్టాలి. అర్హులకు కచ్చితంగా లబ్ధి జరగాలి. ఆసరా పింఛన్లలో ముఖ గుర్తింపు చేపట్టడంతో 3 లక్షల మంది అనర్హుల పేర్లు తొలగించ గలిగామని తెలిపారు.
* రవాణా శాఖ డాటా ఆన్‌లైన్‌లో పూర్తి చేయాలి. పాఠశాల బస్సులు, ఇతర వా హనాలకు ఫిట్నెస్ పరీక్షలు సక్రమంగా నిర్వహించాలి. ఆర్టీసీ బస్సు డ్రైవర్లతో పాటు లారీలు, ఇతర సరకు రవాణా వా హనాల డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించాలి. ఎక్కువ సంఖ్యలో డ్రైవర్లు కలు సుకునే చోటనే ఈ శిబిరాలు ఏర్పాటు చేసి వారికి పరీక్షలు నిర్వహించాలి.
* రహదారులపై భారీ స్థాయిలో గుంత లు, ప్రమాదం జరిగే స్థలాల వివరాలు తెలుసుకునేందుకు వాట్సాప్ నంంబర్‌ను రవాణా శాఖ ఇవ్వాలి. ఆ నంబర్‌కు వచ్చే సమాచారం ఆధారంగా అక్కడ మరమ్మతులు చేపట్టడం, ఇతర జాగ్రత్తలు తీసుకోవడం చేయాలి. ఓఆర్‌ఆర్, ఓఆర్‌ఆర్ సర్వీసు రోడ్ల వెంట భారీగా చెత్త, ఇతర నిర్మాణ వ్యర్థాలు డంప్ చేస్తున్నారు. వ్యర్థాలను తీసుకువచ్చే వాహనా లను పట్టుకొని జరిమానాలు విధించాలి. కేసులు పెట్టాలి. ఓ ఆర్ ఆర్ ఏజెన్సీని బాధ్యులను చేయాలి.
* మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ప్రతి నెలా బిల్లులు ఎలాంటి ఇబ్బంది లేకుం డా చెల్లించాలి. పిల్లలకు పోషకాహారం అందాలి. అందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలి. మూ డు కార్పొరేషన్లతో పాటు నగరాలు, పట్టణాల్లోని వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు, బా య్స్, గరల్స్ హాస్టళ్ల వివరాలు నమోదు చేసుకోవాలి. ఆయా హాస్టళ్ల ఏర్పాటుకు అనుమతులు, వాటిపై పర్యవేక్షణ ఉండా లి. వాటి యాజమాన్యాలకు జవాబుదారీతనం ఉండాలి.
* పాఠశాలలు, కళాశాలల్లో గంజాయి, డ్రగ్స్, సిగరెట్ల వినియోగం జరిగితే అం దుకు ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు బాధ్యత వహించాలి. ప్రతి ప్రైవే టు, కార్పొరేట్ పాఠశాల, కళాశాలల్లో సబ్జెక్ట్ టీచర్స్, పీఈటీ ఎలా ఉంటారో అలానే సైకాలజిస్ట్ ఉండేలా చూడాలి.
* వ్యవసాయ శాఖ భూసార పరీక్షలు చేపట్టి సకాలంలో రైతులకు వాటి సమాచారం అందజేయాలి. ఏ భూమిలో ఏ పంట బాగా పండుతుంది అనే విషయం రైతులకు తెలియజేయాలి. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు సాగు చేసేలా అన్నదాతలను ప్రోత్సహించాలి. పంట మార్పిడి, పంటల వైవిధ్యత ప్రయోజనాలను వివరించాలి. యూరియా యాప్ లో కొంత గందరగోళం ఉన్నట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు. దానిని సులువుగా వినియోగించేలా మార్పులు చేయా లి.. నానో యూరియా ఉపయోగాలను క్షేత్రస్థాయిలో ప్రదర్శన ద్వారా రైతులకు చూపించాలి.
* వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ పరస్పరం సమన్వయంతో ముందుకు సాగాలి. పంటలు వేసే మొదలు పంట ఉత్పత్తుల అమ్మకం వరకు సరైన కార్యాచరణ ప్రణాళిక ఉంటేనే ఇబ్బందులు ఎదురుకావు. ఈ విషయంలో ఈ రెండు శాఖలు పరస్పర సహకారంతో ముందుకుసాగాలి.
ఏప్రిల్ 2న గ్రామసభలు..
ఏప్రిల్ 2న గ్రామ స్థాయిలో గ్రామ సభల నిర్వహణ, ఏప్రిల్ 16న మండల స్థాయిలో, మే 2న నియోజక వర్గ స్థాయిలో , మే 22న జిల్లా స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిచాలని, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు చేపట్టాలని సదస్సులో నిర్ణయం తీసుకున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిసరాల పరిశుభ్రత , ప్రభుత్వ ఆఫీసుల్లో పెండింగ్ పైళ్ల క్లియరెన్స్ , ఆరోగ్య, అరైవ్.. ఆలైవ్, సంక్షేమం, పిల్లల భద్రత.. డ్రగ్స్‌కు అడ్డుకట్ట, రైతు సంక్షేమం.. వ్యవసాయం , విద్య, యువత.. క్రీడలు, మహిళలు, పర్యావరణం ’ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కలెక్టర్ల సదస్సులో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, దామోదర్ రాజనరసింహ, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహా దారులు సుదర్శన్‌రెడ్డి, చిన్నారెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




