4 March, 2026 | 2:45 AM

మంత్రి పొంగులేటి సంస్థ కొండలను పిండి చేస్తోంది

04-03-2026 01:04 AM

అనుమతుల్లేకుండానే మైనింగ్

  1. సీఎం అల్లుడి అనుయాయులకు ఓపెన్ బిడ్డింగ్ లేకుండా 17ఎకరాలు
  2. పేదల ఇళ్లను కూల్చే హైడ్రాకు మంత్రుల అక్రమాలు కనిపించవా?
  3. మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, మార్చి 3 (విజయక్రాంతి): ఓఆర్‌ఆర్‌కు ఆనుకుని ఉన్న రాజేంద్రనగర్ మండలంలోని మానస హిల్స్ ప్రాంతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి చెందిన సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా అక్రమ క్వారీలు నిర్వహిస్తూ కొండలను పిండి చేసి కోట్లు దండుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉం దని మాజీమంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.

నిబంధనలకు తూట్లు పొడుస్తూ, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ క్వారీలతో సహజ సంపదను కొల్లగొట్టే గలీజ్ దందా చేస్తుంటే రెవెన్యూ, మైనింగ్, పీసీబీ, హెచ్‌ఎండీఏ అధికారులు ఎందుకు అటువైపు కన్నెత్తి చూడటం లేదని నిలదీశా రు. ఈమేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. సాధారణ వ్యక్తులకు ఒక న్యాయం? మంత్రికి ఒక న్యాయమా? అని ప్రశ్నించారు.

నెలల తరబడి కొండలను పిండి చేసి, భారీగా కాం క్రీటు తరలింపు జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖలు ఎందుకు మౌనం పాటిస్తున్నా యని నిలదీశారు. విద్యుత్ మంత్రి భట్టి విక్రమార్క, పర్యావరణ మంత్రి కొండా సురేఖ, గనుల శాఖ మంత్రి వివేక్ సహా యావత్ ప్ర భుత్వ యంత్రాంగం ఎందుకు మొద్దు నిద్ర నటిస్తున్నట్లు? అని విమర్శించారు. క్వారీకి టీఎస్‌పీసీబీ, పర్యావరణం, మైనింగ్ లీజ్ అనుమతి, స్థానిక గ్రామపంచాయతీ, హెచ్‌ఎండీఏ క్లియరెన్స్ లేదని, ఎక్స్‌ప్లోజివ్ లైసె న్స్, రెవెన్యూ అనుమతుల్లేవని వెల్లడించారు. 

నామినేషన్ పద్ధతిలో 17 ఎకరాలు..

ఒక వైపు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొ ని రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దందా కోసం పేదల ఇండ్లు కూల్చుతాడు, మరోవైపు అదే ముఖ్యమంత్రి తన అల్లుడి అనుయాయుల క్వారీ కోసం ఎలాంటి బిడ్డింగ్ లేకుండా గం పగుత్తగా 17 ఎకరాల ప్రభుత్వ భూమి నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ పద్ధతిలో కట్టబెడతారని ఆరోపించారు. ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం జరుగుతున్నదని, ఓపెన్ బిడ్డింగ్ పిలవాలని తాము డి మాండ్ చేస్తే మూడు రోజులైనా తేలు కుట్టిన దొంగల్లా ఉలుకరు పలకరని తెలిపారు.

అసలు రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వమా? రియల్ ఎస్టేట్ కంపెనీనా? అని ప్రశ్నించా రు. ప్రభుత్వ భూములు రక్షించాల్సిన సీఎం, మంత్రులే భూబకాసురులుగా మారి భూములను భక్షిస్తుంటే ఇక రక్షించే వారెవరు? అని పేర్కొన్నారు. ’తెలంగాణ అంటే బిజినెస్’ అని నిర్వచనాలు చెప్పే రేవంత్ రెడ్డి అండ్ కో.. మీ ధనదాహం తీర్చుకోవడం కోసం తెలంగాణను గంపగుత్తగా అమ్ముకుంటారా అని నిలదీశారు.

వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో ఉన్న కొండలను మీ మంత్రి, మీ అల్లుడు మాయం చేస్తుంటే ఎందుకు సహకరిస్తున్నారని ప్రశ్నించారు.  ప్రభుత్వ ఆస్తిని మంత్రి కంపెనీ అప్ప నంగా తన్నుకు పోతుం టే ఎందుకు ప్రొటెక్ట్ చేయడం లేదన్నారు. శని, ఆదివారాలు వచ్చిందంటే చాలు పేదల ఇళ్ల మీదకు వెళ్లే హైడ్రా బుల్డోజర్‌కు ప్రభు త్వ భూమిలో ఉన్న ఈ అక్రమ క్వారీ కనిపించడం లేదా ప్రశ్నించారు. 

ఈ మైనింగ్ దం దాలలో మీకు ఎలాంటి వాటా లేకపోతే, వెంటనే మీ సహచర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని, ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న అక్రమ క్వారీని మూసివేయించాలని, ఇప్పటి వరకు కొల్లగొట్టిన సహజ సంపద మొత్తాన్ని పెనాల్టీతో సహా రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా, ఎలాంటి ఓపెన్ బిడ్డింగ్ లేకుం డా గంపగుత్తగా కట్టబెట్టిన 17 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపును  రద్దు చేసి, పారదర్శకంగా ఓపెన్ బిడ్డింగ్ నిర్వహించాలని డిమా ండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ మైనింగ్ దందా కనిపించకపోతే చెప్పండి, స్వయంగా తానే వచ్చి చూపిస్తానని, అక్కడే నిజానిజాలు నిగ్గుతెల్చుదాం! అంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఆయన సవాల్ విసిరారు.