డాక్టర్ కళ్యాణికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు సన్మానం
చర్ల ,(విజయక్రాంతి) : చర్ల మండలానికి చెందిన డాక్టర్ కళ్యాణి ఎంబిబిఎస్ పూర్తి చేసుకున్న సందర్భంగా బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావు ఆమెను, ఆమె తండ్రి దుర్గారావుని మణుగూరు పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. డాక్టర్ కళ్యాణి వైద్య విద్యకు రేగ విష్ణు ఫౌండేషన్ ద్వారా రేగ కాంతారావు ఆర్థిక సహాయం అందించారు. తన చదువుకు అండగా నిలిచినందుకు డాక్టర్ కళ్యాణి, తండ్రి దుర్గారావు రేగ కాంతారావు కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావు చేతుల మీదుగా డాక్టర్ కళ్యాణి, దుర్గారావు కి చిరుసత్కారం జరిగింది. ఈ సందర్భంగా రేగ కాంతారావు మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి సామాన్యులకు వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చారని గుర్తుచేశారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి కష్టపడి చదివి డాక్టర్ స్థాయికి ఎదిగిన కళ్యాణిని అభినందించారు. ఆమెకు సహాయం చేయడం సంతృప్తినిచ్చిందన్నారు.






