calender_icon.png 4 February, 2026 | 7:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేములవాడ అభివృద్ధిపై బీఆర్‌ఎస్ ధ్వజం.. చల్మెడ ఫైర్

04-02-2026 02:08:36 AM

వేములవాడ,ఫిబ్రవరి 3,(విజయక్రాంతి): వేములవాడ మున్సిపల్ పరిధిలో కేసీఆర్ పాలనలో సుమారు రూ.300 కోట్ల అభివృద్ధి జరిగిందని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడి గే హక్కు బీఆర్‌ఎస్ పార్టీకే ఉందని వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీనరసింహరావు అన్నారు. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గు డిచెరువు సుందరీకరణ, మిషన్ భగీరథ ద్వారా ఓవర్హెడ్ ట్యాంకులు, 9 వేల నల్లా కనెక్షన్లు, బద్దిపోచమ్మ ఆలయ అభివృద్ధి, మిడ్ మానేరు నుంచి పైపులైన్, మున్సిపల్ పార్కు, శామకుంట రైతు మార్కెట్ నిర్మాణం వంటి పనులు బీఆర్‌ఎస్ హయాంలో జరిగాయని వివరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లుగా కాలయాపన చేస్తోందని, ఎన్నికలు సమీపిస్తున్నాయని తెలుసుకుని రోడ్ల పనులు చేపడుతోందని విమర్శించారు. వేములవాడ ఆలయంపై కూడా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈనెల 11న జరిగే పురపాలక ఎన్నికల్లో ప్రజలు తమ తీర్పు ఇస్తారని పేర్కొన్నారు.ఈ సమావేశంలో మున్సిపల్ కో-ఆర్డినేటర్ గూడూరు ప్రవీణ్, జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ-రాఘవరెడ్డి, సీనియర్ నాయకులు పొలాస నరేందర్, సిరిగిరి చందు, సుద్దాల సర్పంచ్ నాగరాజు, నాయకులు కాసావేణి మహేష్, మాసం అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.