calender_icon.png 4 February, 2026 | 5:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథని పట్టణ ప్రగతి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం

04-02-2026 02:07:13 AM

మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ట తిరుపతి యాదవ్

మంథని ఫిబ్రవరి 3 (విజయ క్రాంతి) పట్టణ ప్రగతి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులకురాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మంగళవారం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వార్డు అభ్యర్థుల బీఫాములను అందజేసినట్లు మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐలి ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న పాల్గొన్నారు. మంథని మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ 13 వార్డులకు సంబంధించిన అభ్యర్థులకు బీఫాం లను అందజేశారు. మంథని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. 1వ వార్డు కుర్ర లింగయ్య, 2వ వార్డు నూకల కమల్, 3వ వార్డు శ్రీపతి బానయ్య, 4వ వార్డు మద్దికట్ల స్రవంతి రమేష్ బాబు, 5వ వార్డు ముస్కుల సయేందర్ రెడ్డి, 6వ వార్డు పోలు రజిత శివ, 7వ వార్డు జంబోజు శ్రీమతి సమ్మయ్య, 8వ వార్డ్ లైశెట్టి రజిత రాజు, 9వ వార్డు మారుపాక నిహారిక నాగరాజు, 10వ వార్డు పెంటరి రాజు, 11వ వార్డు వోడ్నాల శ్రీనివాస్, 12వ వార్డు వేముల లక్ష్మి సమ్మయ్య,13 వ వార్డు నుండి ఎల్లెంకి వంశీ లకు బీఫాంలోనే అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంథని మున్సిపల్ ప్రజలు మంత్రి శ్రీధర్ బాబు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు బలపరిచిన అభ్యర్థుల కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు కు ఓటు వేసి అధిక మేజర్టీ గెలిపించి, మంథని మున్సిపల్ అభివృద్ధికి తోడ్పడాలని తిరుపతి యాదవ్ కోరారు.