25 June, 2026 | 3:56 PM

తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీక.

25-06-2026 03:16 PM

గొట్టిపర్తి గ్రామంలో ఘనంగా విగ్రహవిష్కరణ.

పాపన్న గౌడ్ స్ఫూర్తితో.. గౌడులు అభివృద్ధి సాధన

తుంగతుర్తి,( విజయక్రాంతి): మొగల్ పాలకుల దౌర్జన్యాలకు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి గోల్కొండ కోటను పాలించిన పరాక్రమవంతుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని బీసీ కమిషన్ సభ్యురాలు బాల లత, బీసీ కమిషన్ మాజీ సభ్యులు కోతి కిషోర్, జై గౌడ సంఘం జాతీయ అధ్యక్షులు రామారావు పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని గౌడ సంఘం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం విగ్రహ నిర్వహణ కమిటీ గౌరవాధ్యక్షులు విగ్రహ దాత తాళ్లపల్లి యాదగిరి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.... సర్దార్ సర్వాయి పాపన్న తెలంగాణ చరిత్రలో అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన మహోన్నత యోధుడని కొనియాడారు.

సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. పాపన్న జీవిత గాథ నేటి యువతకు ఆదర్శమని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.విగ్రహ ఆవిష్కరణ అనంతరం పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పాపన్న కు జై కారాలు పలికారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిలకల మంజుల వెంకన్న,తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ  వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, విగ్రహావిష్కరణ కమిటీ అధ్యక్షులు కోతి యాకన్న, గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, గోడ సంఘం నాయకులు అంజిబాబు, , రవీందర్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్,మాజీ జెడ్పిటిసి పాలకుర్తి రాజయ్య గౌడ్, మాజీ సర్పంచ్ కోతి ఆలియా, కార్యక్రమం బహుజన ఉద్యమ నాయకులు మానుకోట ప్రసాద్, మద్దెల సందీప్, పాలకుర్తి శ్రీకాంత్,కల్లుగీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు నరసయ్య, ప్రధాన కార్యదర్శి చిర్ర నరేష్, విగ్రహ కమిటీ సభ్యులు బోమ్మగాని వెంకన్న, ముత్యం యాకయ్య, ముత్యం అనిల్, మల్లయ్య, వెంకన్న, నగేష్,, మహేష్,గౌడ సంఘం నాయకులు, వివిధ యువజన సంఘాల నాయకులు ఇతరులు పాల్గొన్నారు.