ఓబీసీ లెక్కలు ఇప్పుడు కాకపోతే ఎప్పుడూకావు
- బీసీ సంఘాలు ఒక్కతాటిపైకి వచ్చి ఉద్యమించాలి
- పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు
హైదరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జనగ ణనలో భాగంగా చేపట్టిన కుల గణనలో ఓబీసీ కాలం ఎందుకు పెట్టలేదని పీసీసీ మా జీ అధ్యక్షుడు వీ హనుమంతరావు ప్రశ్నించారు. కులగణన లేకుంటే జనగణనా ఎం దుకని, బీసీల లెక్క ఎంతో తేల్చకపోతే ఎలా అని, బీసీలు రాజకీయాల్లో ఎలా ఎదుగుతారని నిలదీశారు. సోమవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీసీ ల విషయంలో కేంద్రం చేస్తున్న కుట్రపై బీసీ సంఘాలన్ని ఏకమై పోరాటం చేయాలన్నారు. కుల గణన ఇప్పుడు కాకపోతే వందే ళ్లయినా మన పరిస్థితి మారదని, ఇందుకు బీసీ సంఘాలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పాదయాత్ర చేసినప్పు డు బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని తెలుసుకుని.. కుల గణన చేసి ఎవరి జనాభా వారికి అంత వాటా ఇవ్వాలని నిర్ణ యం తీసుకున్నారని వివరించారు. రాహుల్‌గాంధీ ఆదేశాల మేరకు తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి కుల గణన చేశారని చెప్పారు. ఇటీవలే రాహుల్‌గాంధీని కలిసి.. తెలంగాణలో ఓబీసీల సభను ఏర్పాటు చేసి, దేశా నికి సందేశం పంపాలని కోరినట్టు తెలిపారు.
బీజేపీకి బీసీలపై అభిమానం, ప్రేమ ఉంటే అందరి లెక్కలు చేపట్టాలని హితవుపలికారు. ఓబీసీ లెక్కలు లేకపోవడంతో అగ్రకులాలే రాజకీయాల్లో పెరుగుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లుకు వ్యతి రేకం కాదని, మహిళా బల్లులోనూ రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. ప్రతి నియో జకవర్గంలోని బీసీ మహిళలకు కుట్టు మిషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని, సీఎం రేవం త్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.






