27 April, 2026 | 6:50 PM

కూసుమంచిలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

27-04-2026 04:14 PM

కూసుమంచి,(విజయక్రాంతి): ఎత్తిన జెండాను దించకుండా పట్టుదల, నిబద్ధతతో ప్రయాణం చేసి , ఎన్నో కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొని, గమ్యాన్ని ముద్దాడి, సాధించిన స్వరాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగానిగా నిలిపిన ఉద్యమ వీరుడు కేసీఆర్ సారధ్యంలో బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తిచేసుకుని 26వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా పాలేరు మాజీ శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మండల కేంద్రమైన కూసుమంచిలో ఘనంగా నిర్వహించడం జరిగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేయడం జరిగింది