ఎర్రుపాలెంలో రాజీవ్ గాంధీ జయంతి
ఎర్రుపాలెం ఆగస్టు 20: మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహరావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొగ్గుల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తదనంతర సమావేశంలో ఏఎంసి చైర్మన్ బండారు నరసింహారావు మాట్లాడుతూ.. దేశయువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని భారతదేశాన్ని ఆధునిక సాంకేతికత వైపు నడిపించిన దూరదృష్టి కలిగిన నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం మాజీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఐలూరి వెంకటేశ్వర్ రెడ్డి , మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శీలం శ్రీనివాస్ రెడ్డి , ఎర్రుపాలెం మండల కెమిస్ట్ & డ్రగ్గిస్ట్ మండల అధ్యక్షులు కర్నాటి సుధాకర్ రెడ్డి , ఎర్రుపాలెం సర్పంచ్ నండ్రు అశ్విని , లక్ష్మీపురం సర్పంచ్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.






