ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
27-04-2026 04:52 PM
తుంగతుర్తి,(విజయక్రాంతి): ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తుంగతుర్తి మండలకేంద్రంలో పాటు అన్ని గ్రామాల్లో బిఆర్ఎస్ పార్టీ పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి అనంతరం మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ... 2001లో కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక రాష్ట్ర 5సాధన కోసం ఆవిర్భవించిన నాటి తెలంగాణ రాష్ట్ర సమితి నేటి భారత రాష్ట్ర సమితి అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. తదనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర ఏండ్లు గా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణ పాఠం చెప్పాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారని, మండలం లోని అన్ని గ్రామాల్లో ఘనంగా రజతోత్సవ. పుట్టినరోజు వేడుకలు జరిగాయని అన్నారు.






