16-05-2025 12:13:06 AM
టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్
ఎల్బీనగర్, మే 15 : అవినీతిలో కూరుకుపోయిన గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ నిధులను దారి మళ్లించిందని, కాళేశ్వరం ప్రాజెక్టుకు తరలించి.. ప్రజల అవసరాలకు చేపట్టాల్సిన పనులను గాలికి వదిలేసిందని టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. సాగర్ రింగ్ రోడ్డు చౌరస్తాలో నూతనంగా నిర్మించి.. ప్రారంభోత్సవానికి సిద్ధం చేసిన లూప్ ను మధుయాష్కీ గౌడ్, జీహెచ్‌ఎంసీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, కార్పొరేటర్ సుజాత నాయక్ తదితరులు గురువారం సాయంత్రం పరిశీలిం చారు.
ఈ సందర్భంగా మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ.. వారం పది రోజుల్లో లూప్ అందుబాటులోకి వస్తుందని, ఎల్బీనగర్ నుంచి వచ్చే వాహనం దారులు కర్మన్ ఘాట్, చంపాపేట్ వైపు వెళ్లే వెళ్లేందుకు సులభతరం కానుందన న్నారు. ఫ్లైఓవర్లు అందుబాటులోకి రావడంతో ప్రజలకు ట్రాఫిక్ చిక్కులు తప్పనున్నాయని వివరించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం జీహెచ్‌ఎంసీలో అవసరమైన పనులను పూర్తి చేస్తుందన్నారు.
ఈ క్రమంలోనే రూ, 25 కోట్లు ఖర్చుపెట్టి సాగర్ రింగ్ రోడ్డులో అసంపూర్తిగా ఉన్న ఫ్లైఓవర్ పూర్తి చేసిందని పేర్కొన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని తెలిపారు. కార్పొరేటర్ల రాజశేఖర్ రెడ్డి, సుజాత నాయక్ తమతమ డివిజన్ల అభివృద్ధికి జీహెచ్‌ఎంసీ నుంచి ప్రత్యేక నిధులు తెస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.