06-07-2025 02:00:09 PM
హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission)కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghose) ఆదివారం సాయంత్రం కోల్ కతా నుంచి హైదరాబాద్ రానున్నారు. రేపటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) సంబంధిత అంశాలపై విచారణ కొనసాగించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అ న్నారం, సుందిళ్ల బరాజ్‌లపై విచారణకు ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పా టు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం అందించిన వివరాలను జస్టిస్ పీసీ ఘోష్ అధ్యయనం చేయనున్నారు. కేబినెట్ అనుమతులకు సంబంధించిన వివరాలను కమిషన్ పరిశీలించనున్నట్లు సమాచారం.
ఇప్పటికే అన్నిదశల్లో విచారణ పూర్తిచేసిన కమిషన్ ప్రస్తుతం రాజకీయ ప్రముఖులను విచారించింది. అందులో భాగంగా జూన్ 6న మాజీ మంత్రి ఈటల రాజేందర్, జూన్ 9న మాజీ మంత్రి హరీశ్‌రావు, జూన్ 11వ తేదీన బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను విచారించిన విషయం తెలిసిందే.