16-05-2025 12:13:31 AM
తాడ్వాయి,మే, 15 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని గ్రంథాలయానికి గురువారం ఫర్నిచర్ వచ్చినట్లు తాడ్వాయి గ్రంథ పాలకుడు పుల్లూరి రాజలింగం తెలిపారు తాడువాయిలో విద్యార్థులు, యువకులు,పాఠకులు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి ఫర్నిచర్ అందించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ కు గ్రంథ పాలకుడు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సిబ్బంది పీబీ శ్రీనివాస్, పాఠకులు తదితరులు పాల్గొన్నారు.