15 April, 2026 | 3:18 AM

ముగిసిన రెండో దశ ఎన్నికలు

15-12-2025 12:00 AM

పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల

నిర్మల్ డిసెంబర్ 14 (విజయ క్రాంతి) : నిర్మల్ జిల్లాలో రెండవ దశ గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆదివారం పకడ్బం దీ ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా ముగిసింది. నిర్మల్ నియోజకవర్గం లోని సోన్ దిల్వార్పూర్ సారంగాపూర్ నర్సాపూర్ కుంటాల నిర్మల్ రూరల్ తదితర మండలాల్లోని 121 జీపీలకు ఆదివారం ఉదయం 7 గంటల నుంచి ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించారు. ఉదయం మందకోడిగా ప్రారంభ మైన పోలింగ్ 10:00 తర్వాత పుంజుకోవడంతో 82.07% ఓటింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. 

ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించిన అధికారులు

నిర్మల్ జిల్లాలో రెండో దశ తరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆదివారం నిర్వహించిన పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల సందర్శించారు, నిర్మల్ సోన్ కుంటాల దిల్వార్పూర్ తదితర మండలంలో పోలింగ్ కేంద్రా లను సందర్శించిన కలెక్టర్ ఎస్పీ ఓటింగ్ శాతాన్ని అడిగి తెలుసుకున్నారు చర్యలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియలు పారద ర్శకంగా నిర్వహించాలని సూ చించారు. ఇది లా ఉండగా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు జిల్లా ఎస్పీ అడిగి తెలుసుకున్నారు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ సర్వేలను ఎన్నికల ప్రత్యేక పరిశీలకు రాలు అయేషా ముషారఫ్ ఖానం పర్యవేక్షించారు