బీఆర్‌ఎస్ పుట్టుకే సంచలనం
l ఎన్నో ఆటుపోట్ల మధ్య రాష్ట్రం సాధించాం
l తెలంగాణ ఉద్యమం అనేక రాష్ట్రాలకు ఆదర్శం
l మా పాలనలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి
l విస్తరించాలనే ఉద్దేశంతోబీఆర్‌ఎస్‌గా రూపాంతరం
l బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పుట్టుక ఒక సంచలనమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. ప్రతికూల పరిస్థితుల మధ్య 2001లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ పార్టీని ఏర్పాటు చేశారని తెలిపారు. శనివారం తెలంగాణభవన్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకల్లో పార్టీ జెండాను కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కేసీఆర్ నడిపిన తెలంగాణ ఉద్యమం దేశంలో అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ఎన్ని జన్మలెత్తినా తెలం గాణ ప్రజల రుణం తీర్చుకోలేమని తెలిపారు. పదేళ్లపాటు తమకు ప్రజలు అధి కారం ఇచ్చారని, దానిని సద్వినియోగం చేసి అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేశామని చెప్పారు.
బీఆర్‌ఎస్ పరిపాలనలో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానం నిలిపేందుకు అహర్నిశలు కృషి చేశామని వెల్లడిం చారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఇతర ప్రాంతాలకు విస్తరించానే ఉద్దేశంతో టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చామని పేర్కొన్నా రు. మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా వంటి రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్‌కు అద్భుతమైన స్పందన లభిస్తున్నదని తెలిపారు. దురదృష్టవశాత్తు అసెంబ్లీ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రాలేదని, అయినా వెనకంజ వేసేది లేదని స్పష్టంచేశారు. రెట్టింపు ఉత్సాహంతో ముం దుకు వెళ్తామని తెలిపారు. ఈ సమయంలో అండగా ఉన్న పార్టీ శ్రేణులు, నాయకులు ధన్యవాదాలు తెలిపారు.
ఈటలను మల్లారెడ్డి మునగ చెట్టు ఎక్కించారు
మల్కాజిగిరి స్థానంలో ఈటల రాజేందర్ విజయం సాధిస్తారని మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించా రు. మల్లారెడ్డి తన రాజకీయ చతురతతో ఈటలపై కామెంట్స్ చేశారని, మునగ చెట్టు ఎక్కించి కింద పడేయాలనేది మల్లారెడ్డి వ్యూ హమని పేర్కొన్నారు. ఈ విషయంలో ఆయ న రాజకీయ అనుభవాన్ని చాటుకున్నారని, మల్కాజిగిరిలో గెలిచేది బీఆర్‌ఎస్ అభ్యర్థేనని, ఆ విషయం ఈటలకు కూడా తెలుసునని పేర్కొన్నారు. మల్లారెడ్డి అన్నమాట అంతరార్దం తెలియక కొంతమంది ఇష్టానుసా రంగా మాట్లాడుతున్నారని మం డిపడ్డారు. కొంతమంది నాయకులు స్వార్థం కోసం పార్టీ వీడినా కిందిస్థాయి కార్యకర్తలు పార్టీతోనే ఉన్నారని తెలిపారు. పార్టీ మారిన కే కేశవరావు, రంజిత్‌రెడ్డి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉన్నదో అందరికీ తెలుసని అన్నారు. పార్టీకి ద్రోహం చేసినవారిని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల తరువాత పార్టీని బలోపేతం చేసి, శిక్షణా కార్యక్రమాలతో పాటు నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడించారు.






