2 May, 2026 | 1:40 PM

ఎక్స్‌లోకి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్

28-04-2024 12:06 AM

l తొలిసారి సోషల్‌మీడియా ఖాతా

l కరెంటు కోతలపై ఎక్స్‌లో సందేశం

l సీఎం, డిప్యూటీ సీఎంపై విమర్శలు

హైదరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారి సామాజిక మాధ్యమాల్లోకి అడుగుపెట్టారు. శనివారం ఎక్స్ (ట్విట్టర్)లో ఖాతా తెరిచిన ఆయన, మొదటగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రాష్ట్ర ప్రజలకు బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కరెంటు కోతలపై ట్వీట్ చేశారు. మహబుబ్‌నగర్ పర్యటనలో ఉన్న ఆయన.. ‘రాష్ట్రంలో చాలా విచిత్రమైన సంఘటనలు జరుగుత్నాయి. నేను గంట క్రితం ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు రెండుసార్లు కరెంటు పోయింది. ప్రతిరోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి రాష్ట్రంలో కరెంటు పోవడంలేదని ఊదరగొడుతున్నారు. నాతోపాటు ఉన్న మాజీ ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో రోజుకు పదిసార్లు కరెంటు పోతున్నదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలనా వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది? రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలి’ అని మరో ట్వీట్ చేశారు.