బీఆర్‌ఎస్ గతమే.. భవిష్యత్ లేదు
- ఆ పార్టీ సచ్చిన శవం
- కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థి..శత్రువు కాదు
- కవిత చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలి
- వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఒక వైపు.. బీజేపీ కూటమి మరోవైపు
- చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాం తి): ‘కొత్త పార్టీ కాదు.. ఉన్న పార్టీ ఉంటుం దా ముస్తారా? బీఆర్‌ఎస్‌కి గతం ఉంది.. భవిష్యత్ లేదు. ఆ పార్టీ సచ్చిన శవంతో సమానం. కవిత చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలి. కాళేశ్వరంపై సీబీఐ డైరెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేస్తాం. బీజేపీతో కలవనని కేసీఆర్ ఒట్టేసి చెప్పాలి. బీజేపీ వాళ్లను ప్రసన్నం చేసుకోవడానికే హరీశ్‌రావు ఢిల్లీ వెళ్లారు. ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి రా బోతుంది. బీజేపీ శిఖండి రాజకీయాలు మానుకోవాలి.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఒక వైపు.. బీజేపీ కూ టమి మరోవైపు పోటీ పడబోతున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం శాసన మండలి కమిటీ హాల్‌లో సీఎం రేవంత్‌రెరడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ప్రతిదీ ఒక ఉద్దేశం కోసం ఏర్పాటు అవుతుంది. అది నెరవేరిన తర్వా త అది గతం అవుతుంది. కేసీఆర్ పార్టీ ఉద్దేశం అయిపోయింది. బీఆర్‌ఎస్ పార్టీ సచ్చిన శవంతో సమానం. బీఆర్‌ఎస్‌కి గ తం ఉంది.. భవిష్యత్ లేదు. బీఆర్‌ఎస్ పార్టీ ఎక్సిఫైరీ డేట్ ముగిసింది అని ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
కల్వకుంట్ల కుటుంబంతో ప్రజలకు సంబంధాలు తెగిపోయాయి. ముసుగు తొడుగుకొని ఇప్పుడు మాట్లాడుతున్నారు. వారికి పంపకాల పంచాయితీనే.. ఆ తర్వాత వారం దరూ ఒక్కటే అన్నారు. ఔరంగజేబ్ నుంచి నేపాల్ రాజు వరకు అధికారం కోసమే హత్యలు జరిగాయి. కేసీఆర్‌కు ఏమైనా ఐతే నాకు ఏమి వస్తుంది. కేసీఆర్‌కు ఏమై నా జరిగితే వాళ్ల కుటుంబ సభ్యులకు లాభం. కేసీఆర్ నా రాజకీయ ప్రత్యర్థి.. శత్రువు కాదు. కేసీఆర్‌కు చెడు జరగాలని కోరుకుంటున్నది వాళ్ల కుటుంబమే. ఎవరివల్ల ప్రమాదం అన్నది కేసీఆరే చూసుకోవాలి.
వాళ్ల వారసత్వ రాజకీయాలకు కాం గ్రెస్‌కి సంబంధం లేదు’ అని తెలిపారు. కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్న రాజకీయ నాయకుడు, ప్రజాప్రతినిధి అని సీఎం విమర్శం చారు. కేసీఆర్ కుటుంబంలో ఎలినేషన్ ప్రక్రియ జరుగుతోంది. మాకు ప్రత్యర్థి ఎవరూ లేరు’ అని తెలిపారు. కాళేశ్వరంపైన కేసీఆర్, హరీశ్‌రావు కోర్ట్‌ను ఏం అడిగారో ముందు తెలుసుకోవాలి..ఘోష్ నివేదికని కొట్టివేయాలని అడిగారు.
కానీ, కోర్ట్ మాత్రం నివేదిక యథాతథంగా కొనసాగుతుంది అని చెప్పింది. నివేదికను కొ ట్టివేయలేదు. నిబంధనలు పాటించలేదని మాత్రమే కోర్ట్ చెప్పింది. సెక్షన్ 8బీ కింద నోటీస్‌లు ఇవ్వలేదన్న విషయంలోనే కోర్ట్ తప్పుబట్టింది. ప్రభుత్వం తరఫున నేను, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సీబీఐ డైరెక్టరును కలుస్తాం’ అని వివరించారు.
కేసీఆర్ ఒట్టేసి చెప్పాలి?
బీఆర్‌ఎస్‌తో ఒప్పందంలో భాగంగానే బీజేపీ నేతలు కాళేశ్వరం గురుంచి మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పునర్ని ర్మాణం పనుల కోసం అన్ని ప్రభుత్వ సం స్థలు పాల్గొంటున్నాయి. కిషన్‌రెడ్డి, బండి సంజయ్ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొ నే అధికారులను మేం సస్పెండ్ చేయా లా..? బండి సంజయ్ మాట్లాడేటప్పుడు అవగాహన ఉండాలి కదా. బీజేపీ వాళ్లను ప్రసన్నం చేసుకోవడానికే హరీశ్‌రావు ఢిల్లీ వెళ్లారు.
ఈ విషయాన్ని పక్కదారి పట్టించడానికే బండి సంజయ్ ఎన్డీఎస్‌ఏ చైర్మన్ గురించి మాట్లాడుతున్నారు. కవిత ప్రశ్నలకు కేసీఆర్ మొదట సమాధానం చెప్పాలి. మన మనిషి కాదు మర మనిషి అన్న మాట పైన చెప్పాలి. బీజేపీతో కలవనని కేసీఆర్ తను నమ్మిన దేవుడి పైన ఒట్టు వేసి చెప్పాలి’ అని సీఎం నిలదీశారు.
రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ కూటమి ఒకవైపు, బీఆర్ ఎస్ కూటమి మరోవైపు ఉండి తలపడబోతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు లో అందరి స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నారు.. తొందరలోనే ఈ కేసు ఒక కొలిక్కి వస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసును హై కోర్టు మానిటరింగ్ చేస్తుంది. మహిళా రిజర్వేషన్ సులభంగా అమలు చేయవచ్చు’ అని సీఎం అన్నారు.
బీజేపీవి శిఖండి రాజకీయాలు
దేశంలో జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచలేదు. చిన్న రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలకు వేరువేరుగా ప్రాతిపదికలు వున్నాయి. 2/3 మెజారిటీ లేదని బీజేపీకి తెలుసు. అయినా బిల్ పెట్టారు. మమ్మల్ని బీజేపీ నాయకులు తప్పుపడితే ఎలా? రాజ్యాంగాన్ని సవరించాలంటే 2/3 మెజారిటీ ఉం డాలి. మహిళా రిజర్వేషన్ పైన 5 రాష్ట్రల ఎన్నికలు రిఫరెండం అని బీజేపీ చెప్పాలి. బీజేపీ చెప్పినట్లు వినాలి అంటే కుదరదు. బాగా పనిచేసే రాష్ట్రాలను శిక్షించే అధికారం లేదు..50 శాతం మెరిట్, 50 శాతం జనాభా ప్రాతిపదిక పునర్విభజన చేయా లి.
50 శాతం సీట్లు పెంచాలని ఏ దేవుడు మోదీకి చెప్పాడు. బీజేపీ శిఖండి రాజకీయాలు మానుకోవాలి’ అని అన్నారు. అయోధ్యలో కూడా బీజేపీ ఓడిపోయింది. రాముడు కూడా బీజేపీని ఓడించాడు. అయోధ్యలో సమాజ్ వాదీ పార్టీ గెలిచింది’ అని తెలిపారు. కాంగ్రెస్ ఎంపీలను వెధవలని కేసీఆర్ చేసిన వ్యా ఖ్యలను సీఎం ఖండించారు. బీఆర్‌ఎస్ వెధవలకు మా ఎంపీల మాటలు వినిపించలేదా?’ అని సీఎం ఫైర్ అయ్యారు.






