అప్పుడు ఇచ్చాం.. ఇప్పుడు రద్దు చేస్తాం !
- విజయక్రాంతి కథనంతో అధికారుల్లో కదలిక
- విచారణ చేసి చర్యలు తీసుకుంటాం
- ‘ది పెర్చ్’ అక్రమ నిర్మాణంపై డీసీ జ్యోతి రెడ్డి వివరణ
సంగారెడ్డి, ఏప్రిల్ 27(విజయక్రాంతి): తెల్లాపూర్ పరిధిలో కొనసాగుతున్న ‘ది పెర్చ్’ కమర్షియల్ కాంప్లెక్స్ అక్రమ నిర్మాణ వివాదంపై చివరకు జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించారు. స్థానికుల నుంచి తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అధికారుల్లో ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఈ విషయంపై జీహెచ్‌ఎంసీ ఏసీపీ పవన్‌ను సంప్రదించగా, ‘నేను కొత్తగా బాధ్యతలు స్వీకరించాను. ఈ ప్రాజెక్ట్‌పై పూర్తి సమాచారం లేదు. సంబంధిత వివరాల కోసం డీ సీని సంప్రదించాలి’ అని తెలిపారు.అనంత రం డీసీ జ్యోతి రెడ్డి స్పందిస్తూ కీలక వ్యా ఖ్యలు చేశారు. ఈ నిర్మాణానికి కేటాయించిన డోర్ నెంబర్‌ను రద్దు చేస్తాం. మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరుపుతాం.
అక్రమంగా నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ‘నాకు తెలియకుండానే డోర్ నెంబర్ ఇచ్చి ఉండవచ్చు’ అని కూడా పేర్కొనడం విశేషం. అయితే ఇప్పటికే పర్మిషన్ రద్దు చేసి, కొంత భాగాన్ని కూల్చివేసిన నిర్మాణానికి డోర్ నెంబర్ కేటాయించడం తీవ్ర అనుమానాలకు తావి స్తోం ది. అక్రమని తేలిన భవనానికి అధికారిక గుర్తింపు ఎలా లభించిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇప్పుడు రద్దు చేస్తారా?
ది పెర్చ్ అక్రమ వాణిజ్య భవన నిర్మాణం అక్రమమని నిర్ధారించి కూల్చివేసినప్పటికీ మళ్లీ ఆ భవానికి డోర్ నెంబర్‌ను కేయించిన జీహెచ్‌ఎంసీ అధికారులు మళ్లీ మాటమార్చుతూ రద్దు చేస్తామని, విచారణ జరుపు తామని చెప్పడంపై స్థానికులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ‘ముందు అనుమతులు ఎలా ఇచ్చారు? కూల్చిన భవనానికి డోర్ నెంబర్ ఎలా కేటాయించారు’? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే హెచ్‌ఎండీఏ తిరస్కరించిన స్థలంలో నిర్మాణం కొనసాగుతుం డటం, పర్మిషన్ రద్దు అయినప్పటికీ పనులు ఆగకపోవడం వివాదాన్ని మరింత ముదురుతోంది. ఈ నేపథ్యంలో విచారణతో సరిపెట్ట కుండా తక్షణమే నిర్మాణాన్ని నిలిపివేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఇటువంటి ఘటనలు మరిన్ని అక్రమ నిర్మాణాలకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






