29 May, 2026 | 9:44 PM

మిషన్ భగీరథ సిబ్బంది సమ్మెను విరమింపజేసిన ఎమ్మెల్యే

29-05-2026 03:34 PM

బోథ్,మే29(విజయక్రాంతి): గత కొన్ని రోజులుగా మిషన్ భగీరథలో పనిచేస్తున్న పంప్ ఆపరేటర్లు ఎలక్ట్రీషియన్లు(Pump Operators and Electricians) సమ్మెలో పాల్గొనడం వల్ల నీటి సరఫరా నిలిచిపోయింది.దీంతో గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జాదవ్ అనిల్ సంబంధిత ఎస్సీ శ్రావణ్ కుమార్ డి ఈ రమకాంత్ ఏ ఈ దివాకర్ సూపర్వైజర్ నాగరాజులతో చర్చించి సమ్మెను విరమింప చేశారు అనేక గ్రామాల్లో నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అధికారులతో మాట్లాడారు దీంతో తమ సిబ్బంది సమ్మెను విరమింప చేస్తున్నారని తక్షణమే మీరు సరఫరా అయ్యే విధంగా చూస్తామని అధికారులు హామీ ఇచ్చారు