calender_icon.png 20 November, 2025 | 5:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు సమస్యలతో రాజకీయం చేస్తున్న బీఆర్‌ఎస్

20-11-2025 12:00:00 AM

చొప్పదండి, నవంబరు 19 (విజయ క్రాంతి): తమ రాజకీయ లబ్ధి కోసం బిఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై పనిగట్టుకొని అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని కురిక్యాల సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిరుమలరావు తెలిపారు.

బుధవారం గంగాధర లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న కొనుగోలు కేంద్రంలో రైతులు ఇబ్బంది పడకుండా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సహకారంతో ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని తెలిపారు. 

కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు పురుమల్ల మనోహర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బాసి బుచ్చన్న, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్, మాజీ జెడ్పిటిసి గునుకొండ బాబు, మాజీ ఎంపిపి రాజగోపాల్ రెడ్డి, పడితపల్లి కిషన్, మాజీ వైస్ ఎంపిపి కర్ర బాపురెడ్డి, తదితరులు పాల్గొన్నారు.