calender_icon.png 20 November, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొగమంచు వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలి

20-11-2025 12:00:00 AM

ఎస్పీ రోహిత్ రాజు

 భద్రాద్రి నవంబర్ 19 విజయ క్రాంతి:శీతాకాలంలో దట్టమైన పొగమంచు కారణంగా రహదారులపై, విజిబిలిటీ బాగా తగ్గుతుంది.వాహనదారులు తమ భద్రతను దృష్టిలో ఉంచుకుని అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.వాహనదారులు తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు: తెల్లవారుఝామున దట్టమైన పొగమంచు కురిసే సమయంలో,ప్రయాణాలు చేయడం శ్రేయస్కరం కాదు.వాయిదా వేసుకోవడం మంచిది.వాహనాలను నిదానంగా నడపండి.

వేగంగా వెళ్లడం అత్యంత ప్రమాదకరంమీ వాహనం యొక్క ఫాగ్ లైట్లు,పార్కింగ్ లైట్లతో పాటు తక్కువ-బీమ్ హెడ్లైట్లను మాత్రమే ఉపయోగించండి.హై-బీమ్ లైట్లు పొగమంచులో మరింత ప్రతిబింబించి,విజిబిలిటీని తగ్గిస్తాయికారులో హీటర్ ను ఆన్ చేసుకుని,ఎల్లప్పుడూ అద్దాలు శుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలిముందు వెళుతున్న వాహనానికి కనీస దూరాన్ని పాటిస్తూ,ఆ వాహన సిగ్నల్స్ ను గమనిస్తూ ఉండాలి.పొగమంచు అధికంగా కురిసే సమయంలో ఓవర్ టేక్ చేయడం మంచిది కాదు.అత్యవసరంగా రోడ్డు ప్రక్కన ఆగాల్సి వస్తే,రోడ్డుకు దూరంగా ఆపి,హజార్డ్ లైట్లను వేసి ఉంచాలి.