20-11-2025 12:00:00 AM
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
మణుగూరు, నవంబర్ 19(విజయక్రాం తి) : తొలి మహిళా ప్రధానిగా ఇందిరా గాంధీ దేశానికి చేసిన సేవలు, అభివృద్ధి సంస్కరణలు అందరికీ ఆదర్శం అని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుఅన్నారు. బుధవారం పట్టణంలోని ఎమ్మె ల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ ప్రధా ని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ, భారతదేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికై దేశానికి ఎనలేని సేవలు చేసి, దేశ వ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల, స్థ లాలు, భూమి లేని నిరుపేదలకు భూము లు పంచి నిరుపేదల గుండెల్లో చిరస్థాయి గా నిలిచిపోయారన్నారు.దేశ సమగ్రతను కాపాడడంలో ఎక్కడ వెనక్కి తగ్గని ఉ క్కు మహిళ ఇందిరాగాంధీని అని కొని యాడారు. గత ప్రభుత్వం పాలనలో గృ హ నిర్మాణ కార్యక్రమం కనుమరుగు అ యిందని, కాంగ్రెస్ పాలనలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తూ నిరుపేదలకు అండగా నిలుస్తున్నారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత రవాణా సౌకర్యం, ఉచి త గృహ విద్యుత్ అందించి అండగా నిలిచిందన్నారు. ఇందిరా గాంధీ ఆశయ సాధనకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చే యాలని ఎమ్మెల్యే పాయం పిలుపునిచ్చా రు. ఈ కార్యక్రమంలో మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పీరినాకి నవీన్, బోన గిరి శివ సైదులు, మహిళా కాంగ్రెస్ అధ్య క్షురాలు కూరపాటి సౌజన్య , దుగ్గంపూడి ఈశ్వర్ రెడ్డి, పినపాక మండల కాంగ్రెస్ అధ్యక్షులు గొడిశాల రామనాథం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాలమూరు రాజు,సామ శ్రీనివాస్ రెడ్డి, మండల నా యకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.