బీఆర్‌ఎస్‌ది తప్పుడు ప్రచారం
- కొండల్‌రెడ్డికి కంపెనీలో ఒక్క షేర్ కూడా లేదు
- కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్
హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాం తి) : ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ లో భూకేటాయింపులపై బీఆర్‌ఎస్ తప్పు డు ఆరోపణలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులపై తప్పుడు ప్రచారం చేస్తు న్నారని మండిపడ్డారు. 2007లోనే ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ కోసం సుమా రు 590 ఎకరాల భూమిని కేటాయి ంచారని గురువారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
భూకేటాయింపుల ప్రక్రియను సీసీఈఎస్‌డీఎం వంటి కన్సల్టేటివ్ కమిటీ పరిశీలిస్తుందని, ఇందులో తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, జీహెచ్ ఎంపీ, హెచ్‌ఎండీఏ తదితర విభాగాల అధికారులు ఉంటారన్నారు. సీఎం లేదా మం త్రులకు ప్రత్యక్షంగా భూముల కేటాయింపు చేసే అధికారం ఉండదని స్పష్టం చేశారు. టెస్సాక్ అడా నస్డ్ సిస్టమ్స్ సంస్థకు భూకేటాయింపుపై బీఆర్‌ఎస్ విమర్శలను కూడా చామల ఖండించారు.
ఈ వ్యవహారంలో సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డి పేరును రాజకీయంగా లాగుతున్నారని ఎంపీ మండిపడ్డారు. 2024లో సంస్థ దరఖాస్తు చేసిన సమయంలోనూ, 2025లో భూకేటాయిం పు జరిగిన సమయంలోనూ కొండల్‌రెడ్డి కంపెనీ డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్ లేదా సభ్యుడు కాదని స్పష్టం చేశారు. కొండల్‌రెడ్డికి కంపెనీలో ఒక్క షేర్ కూడా లేదని, ఆ యన కుటుంబ సభ్యులకు కూడా కంపెనీలో వాటాలు లేవన్నారు.






