05-06-2025 11:02:53 PM
ఎల్బీనగర్: చైతన్యపురి డివిజన్ బీఆర్ఎస్ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి(Chandrasekhar Reddy) పుట్టినరోజు వేడుకలు గురువారం దిల్ సుఖ్ నగర్ లోని కమ్యూనిటీ హాల్ లో జరిగాయి. వేడుకలకు ముఖ్య అతిథులుగా మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు తోట మహేష్ యాదవ్, కొత్తపేట్ మాజీ కార్పొరేటర్ సాగర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకుడు శివప్రకాశ్ పాల్గొని చంద్రశేఖర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం అభిమానులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యుల మధ్య ఆయన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులు భారీ గజమాలతో చంద్రశేఖర్ రెడ్డిని సత్కరించి, అనంతరం ప్రజలందరికీ అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు చంద్రశేఖర్ రెడ్డిని శాలువాలు పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.