మామడ మాజీ ఎంపీపీ కిడ్నాప్ కలకలం
హైదరాబాద్: మెదక్ జిల్లా తూప్రాన్ టోల్ గేట్(Toopran toll gate) వద్ద కిడ్నాప్ కలకలం రేగింది. నిర్మల్ జిల్లా మామడ మండల మాజీ ఎంపీపీ, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టర్, బీఆర్ఎస్ నాయకుడు చిక్యాల హరీశ్ కుమార్‌ను దుండగులు కిడ్నాప్ చేశారు. శనివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో పొన్కల్‌లోని హరీశ్ నివాసానికి కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని బలవంతంగా తీసుకెళ్లారు. నిర్మల్ లో తెల్లవారుజామున బీఆర్ఎస్ నేత హరీశ్ కిడ్నాస్ ఘటన కలకలం రేపుతోంది.
తూప్రాన్ టోల్ గేట్ వద్ద తప్పించుకుని హరీశ్ పోలీసులను సంప్రదించారు. కిడ్నాప్ పై తూప్రాన్ పోలీసులు(Toopran Police) మామడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అసలు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించింది ఎవరూ.. ? ఎందుకు కిడ్నాప్ చేయాలనుకున్నారు? అనే కోణాల్లో సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఆయనను నిర్మల్‌కు తీసుకొచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలియనున్నాయి.






