టీచర్లకు టెట్ మినహాయింపు ఇవ్వాలి
07-07-2026 02:19 AM
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి తపస్ వినతి
హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహా యింపు ఇవ్వాలని, యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ విషయంలో రాజ్యాంగబద్ధమైన చిక్కులు తొలగించాలని కోరుతూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కోరారు.
సోమవారం కిషన్‌రెడ్డిని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (త పస్) రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి ఓ డ్నాల రాజశేఖర్, తెల్కలపల్లి పెంటయ్య, సం ఘటన కార్యదర్శి హనుమంతరావు కలిసి వినతిపత్రం సమర్పించారు. పీఆర్సీ, డీఏ పెండింగ్ బిల్లులతో పాటు కేజీబీవీ ఉపా ధ్యాయనిలకు 29 రోజుల సమ్మె శాలరీ చె ల్లించేందుకు చొరవ తీసుకోవాలని కోరారు.






