14 April, 2026 | 11:56 PM

అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో బిఆర్ఎస్ నాయకులు

14-04-2026 07:28 PM

ముకరంపుర,(విజయక్రాంతి): రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోర్టు  చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి జిల్లా బిఆర్ఎస్ నాయకులతో కలిసి వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జై భీమ్ అంబేద్కర్ ఆశయాలు కొనసాగిద్దాం అంబేద్కర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ... దేశం సుస్థిరంగా ఇంత పటిష్టంగా.. ఉందంటే కేవలం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే అని.. వారు చూపిన బాటలో నడవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి  పైన ఉందన్నారు. 

ఆ మహనీయుని జయంతి వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్,  నగర పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి , నగర మైనారిటీ అధ్యక్షుడు మీర్ షౌకత్ అలీ ,వివిధ డివిజన్ ల అధ్యక్షులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు  పాల్గొన్నారు.