23-08-2025 12:07:30 AM
అనుమతులున్నాయా?
కార్పొరేషన్ కమిషనర్ మౌనం ఎందుకు
పాల్వంచ పోలీసులకు పట్టింపు లేదా
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 22,(విజయ క్రాంతి) నిబంధనలతో పని ఏంటి... అడుగడుగునా ఫ్లెక్సీలు, అనుమతులతో మాకేం సంబంధం అన్నట్లు ఉంది అభిమానుల హంగు ఆర్భాటం.సహకార సంఘం ఉపాధ్యక్షులు మున్నూరు కాపు సంఘం నా యకులు జన్మదిన ని పురస్కరించుకొని అభిమానులు పాల్వంచలో ఇబ్బడి ముబ్బడిగా ఫ్లెక్సీలు కట్టి అభిమానం అలుగు లు పారింది.
ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, అడుగడుగునా కటౌట్లు బిఆర్‌ఎస్ నాయకుడి పుట్టినరోజు సందర్భంగా పాల్వంచ పట్టణంలో విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్లు చూసి ప్రజలు ఇదేం చోద్యం అంటున్నారు. ఇష్టారీతిన ఫ్లెక్సీలను పెడుతున్నప్పటికి కార్పొరేషన్ అధికారులు పట్టించు కోకపోవడం ఏమిటం టు ప్రశ్నిస్తున్నారు. కార్పొరేషన్ కమిషనర్ బిఆర్‌ఎస్ నాయకులతో లోపాయకారి ఒ ప్పందం ఏమైనా చేసుకున్నారేమో అని బ హిరంగంగా చర్చించుకున్నారు.
దారిన పో యే ప్రతి ఒక్కరు పుట్టినరోజు సందర్బంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్లు చూసి ఈ ఫ్లెక్సీ గోలేంటని చర్చించు కుంటున్నారు. వాహనదారులకు ఇబ్బంది కలిగించేలా ఫ్లెక్సీలు, కటౌట్ పెడితే పోలీసులు పట్టించుకోరా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.