23-08-2025 12:07:49 AM
జిన్నారం(గుమ్మడిదల), ఆగస్టు 22 : న్యూలాండ్ పరిశ్రమ ఆధ్వర్యంలో గడ్డపోతారంలో ఉచిత వైద్య శిబిరం సేవలను నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 340 మందికి పైగా గ్రామస్తులు జనరల్ చెకప్, డయాబెటిక్, కంటి పరీక్షలు, డాక్టర్ కన్సల్టేషన్ వంటి వైద్య సేవలను పొందారు, ఉచిత జనరిక్ మందులతో పాటు కళ్ళద్దాలును ఉచితంగా పంపిణీ చేశారు.
మున్సిపల్ కమిషనర్ వెంకటరామయ్య, మధుసూదన్ రెడ్డి పాల్గొని ఇటువంటి కార్యకలాపా లను నిర్వహిస్తున్నందుకు న్యూలాండ్ ఫౌండేషన్ పరిశ్రమకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంపెనీ సభ్యుల వరప్రసాదరావు, కంపెనీ డాక్టర్ అడ్రియన్, డాక్టర్ కవిత, మధుబాబు, పీఆర్వో రాజేష్, యాదగిరి పాల్గొన్నారు.