23-08-2025 12:07:17 AM
ప్రారంభించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్, ఆగస్టు 22 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పిఎస్‌ఓ ( పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ల ) శిక్షణ కార్యక్రమంను పోలీస్ కమాండ్ కంట్రోల్ హల్‌లో నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీఐపీల భద్రతా నేపథ్యం లో సేవలు అందించే PSO పీఎస్ ఓ ల పాత్ర అత్యంత ముఖ్యమైనదన్నారు.
సిబ్బంది నైపుణ్యాలను మెరుగుపరచడానికి , అత్యాధునిక విధానాలపై అవగాహన కల్పించడానికి, ఇంకా అత్యవసర పరిస్థితుల్లో అప్పటికప్పుడు తీసుకోవలసిన చర్యలపై స్పష్టత ఇవ్వడాని కి ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మరింత అవగాహన కల్పించడానికి ఈ శిక్షణ ఏర్పాటుచేసి నట్లు సాయి చైతన్య తెలిపారు. ఈ శిక్షణలో పొందే జ్ఞానం, అనుభవం మీ బాధ్యతల్ని మరింత సమర్థంగా నిర్వర్తించేందుకు దోహదపడుతుందని సి సూచించారు.
ప్రతి పిఎస్ ఓ అధిక నైపుణ్యంతో, పట్టుదలతో, నిబద్ధతతో ముందుకు వెళ్ళడానికి ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగ పడుతుంది అన్నారు. ఈ రెండు రోజుల శిక్షణా కార్యక్రమంను ప్రతీ పీఎస్ ఓ సద్వినియోగం చేసుకోవాలని ఇబ్బందిని సిపి కోరారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అదనపు డీసీపీ ఏ ఆర్ రామచంద్ర రావు రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, తిరుపతి , సతీష్ , శేఖర్ బాబు పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.