రోడ్డు నిర్మాణ పనులు పర్యవేక్షించిన బీఆర్‌ఎస్ నాయకులు
10-07-2026 12:00 AM
ఉప్పల్, జూలై 9 (విజయక్రాంతి): సుమారు రూ.30 లక్షల వ్యయంతో బాబా నగర్ లోని జరుగుతున్న సిమెంటు రోడ్డు నిర్మాణ పనులను బారాస రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్ పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్తీ నూతన సిమెంట్ రోడ్డులు పూర్తి అయ్యే దశకు చేరుకున్నాయని ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి సహకారంతో మాజీ కార్పొరేటర్ హయంలో సిమెంట్ రోడ్లు నిర్మాణాలు నిధులు మంజూరయ్యాయని తెలిపారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేర్చమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో టేకులపల్లి రామచందర్ పొన్నాల మహేందర్ జెరిపోతుల భాస్కర్ నయీమ్ రాజు గౌడ్ కట్ట బుచ్చన్న గౌడ్ అశోక్ దేవా మల్లేష్ మల్లికార్జున్ గౌడ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.






