10 July, 2026 | 1:51 AM

హోటళ్లు, రెస్టారెంట్‌లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

10-07-2026 12:00 AM

కూకట్‌పల్లి, జూలై 9 (విజయక్రాంతి ): కూకట్ పల్లి జోనల్ పరిధిలోని పలు రెస్టారెంట్ రెంట్ లు, హోటల్ లపై సిఎంసి  ఫుడ్ సేఫ్టీ అధికారులు గురువారం తనికీలు నిర్వహించారు. గత కొంత కాలంగా నగరం లోని రెస్టారెంట్ లు, హోటల్ లలో ఆహార భద్రత ప్రమాణాలు పాటించడం లేదంటూ పిర్యాదులు అధికంగా రావటం తో కూకట్ పల్లి, మూసాపేట్ పరిధిలో ని రెస్టారెంట్ లు హోటల్ పై దాడులు చేసి తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీలలో పలు హోటలలో కుళ్ళిన మాంసం, కాలం చెల్లిన బట్టర్, సెనగపప్పు, పుట్టగొడుగులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కూకట్ పల్లి లోని సిద్ధికి కబాబ్ సెంటర్ లో మాంసం సరైన విధంగా నిలువ చేయడం లేదని, మూసాపేట్ లోని అరేబియన్ మండి లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిపారు.

కైతలాపూర్ వైన్ అండ్ డైన్ బార్ అండ్ రెస్టారెంట్ కిచెన్ లో కాలం చెల్లిన పుట్టగొడుగులు, పప్పు దినుసులు నిలువ ఉండే చోట ఎలుకలు బొద్దింకలు తిరుగుతున్నట్టు గుర్తించారు. భాగ్ అమీర్ ప్రాంతంలోని శ్రీ ద్వారక గ్రాండ్ క్లౌడ్ కిచెన్ లో కాలం చెల్లిన బట్టర్,పప్పు దినుసులతో పాటు కిచెన్ లో బొద్ధింకలను, ఈగలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఆహార భద్రత నియమాలు పాటించని హోటల్ యజమానులకు నోటీసులు అందజేసినట్లు  ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు.