తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ శ్రీరామరక్ష
‘కేసీఆర్ కోసం అమర్నాథ్ యాత్రలో పాల్గొన్న మాజీ సర్పంచ్
ధర్మపురి, జులై 9 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రానికి కేసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ జగిత్యాల జిల్లా ఎండపల్లి గ్రామ మాజీ సర్పంచ్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు మారం జలంధర్ రెడ్డి అమర్నాథ్ యాత్రలో పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లో జరుగు శ్రీ అమర్నాథ్ యాత్రకు బాల్తాల్ బేస్ క్యాంపు నుండి 14 కిలోమీటర్లు సముద్ర మట్టం నుండి12,756 అడుగుల ఎత్తున గల అత్యంత కఠినమైన శ్రీ అమర్నాథ్ జి మంచులింగంలను కాలినడక మార్గంలో ఆయన దర్శించుకుని అమర్నాథ్ జీ సన్నిధిలో తెలంగాణ శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
జమ్ము కాశ్మీర్లోని పవిత్ర అమర్నాథ్ యాత్రలో భక్తిశ్రద్ధలతో పాల్గొని శ్రీఅమర్నాథ్ జీ స్వామివారిని దర్శించుకుని తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేక మొక్కులు సమర్పించారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరోసారి ముఖ్యమంత్రిగా సేవలందించాలని, ధర్మపురి నియోజకవర్గానికి కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేసే అవకాశం లభించాలని శ్రీ అమర్నాథ్ జీ సన్నిధిలో ప్రార్థించినట్లు ఆయన పేర్కొన్నారు.






