మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌ను కలిసిన బీఆర్‌ఎస్ నేతలు
26-08-2026 02:17 AM
ఆమనగల్లు, అగస్టు25(విజయక్రాంతి): కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు జైపాల్ యాదవ్ను మంగళవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, పూలమాలలతో సత్కరించారు.
అనంతరం నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ పటిష్టతకు చేపట్టాల్సిన చర్యలు, నియోజకవర్గ పరిస్థితులపై నాయకులు చర్చించారు. కార్యక్రమంలో కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సింగం విజయ్ గౌడ్, వెల్దండ మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్, వైస్ చైర్మన్ గోవర్ధన్, మాజీ ఎంపీటీసీ చెన్నయ్య, ఏఎంసీ మాజీ డైరెక్టర్ సుభాష్, మాడ్గుల బీ అర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వరుణ్ తదితరులు పాల్గొన్నారు.






