26 August, 2026 | 4:06 AM

వనమహోత్సవంలో అందరూ భాగస్వాములు కావాలి

26-08-2026 02:18 AM

ఆమనగల్లు, అగస్టు25(విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగమై వన మహోత్సవం కార్యక్రమాన్ని  విజయవంతం చేయాలని అధికారులు పిలుపునిచ్చారు.మంగళవారం పట్టణంలో మున్సిపల్, అటవీ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో  వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.  ఆమనగల్లు, జంగారెడ్డిపల్లి రహదారికి ఇరువైపులా తో పాటు పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై మొక్కలు  నాటాలని వారు పిలుపునిచ్చారు కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ టి. గీతా ఆచారి, కమిషనర్ ఎస్. రాఘవేందర్ రెడ్డి, ఎస్హెచ్‌ఓ వెంకటేశ్వర్లు, ఫారెస్ట్ డిప్యూటీ రేంజర్ జగన్ మోహన్, సబ్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డిలతో పాటు స్థానిక కౌన్సిలర్లు, మున్సిపల్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.