calender_icon.png 2 February, 2026 | 12:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిట్ కేసు తాడూ బొంగరం లేనిది..

02-02-2026 12:19:54 AM

ప్రతిపక్షంలో లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది 

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్ నేతల నిరసనలు 

నిరసనలో పాల్గొన్న మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ సీ లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు 

మహబూబ్ నగర్/వనపర్తి/నారాయణ పేట, నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): తాడు బొంగరం లేని కేసు సిట్ వి చారణ అని ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను ఎన్నికల సమయం లో తప్పుదోవ పట్టించేందుకే సిట్ విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరం జన్ రెడ్డి, డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ సీ లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రం లోని అం బేద్కర్ చౌరస్తాలో మాజీ శాసన మండలి సభ్యులు స్వామి గౌడ్, స్థానిక నాయకులతో కలిసి ఆయన నిరసన కార్యక్రమంను నిర్వహించి మాట్లాడారు.

గద్వాల జిల్లా కేంద్రం లో నియోజకవర్గ ఇంచార్జి బాస్ హన్మంత్ నాయుడు, అలంపూర్ నియోజకవర్గం లో ఎమ్మెల్యే విజేయుడు స్థానిక నాయకులతో కలిసి వేరువేరుగా నిరసనలను వ్యక్తం చేశా రు. అలాగే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో రోడ్డుపై బైఠా యించి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిరసన వ్యక్తం చేశారు, జడ్చర్లలో మాజీ మంత్రి డాక్టర్ నల్ల బ్యాడ్జీలను ధరించి కార్యకర్తలతో కలిసి రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు.

నారాయణపేట జిల్లా కృష్ణా మండలం గుడిబ ల్లూరు పంచాయతీ పరిధిలోని టైరోడు వద్ద మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆ ధ్వర్యంలో ధర్నా,రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. ఏర్పడినది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మండలంలో కూడా నిరసనలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మక్తల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహా గౌ డ్, రాజు ఆసి రెడ్డి, శివరాజ్ పాటిల్, మాగనూరు మండలం బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు ఎల్లారెడ్డి, మాజీ సర్పంచ్ అమ్రేష్, స్వామి గౌడ్, సర్పంచ్ నర్సింలు, మారెప్ప, శివప్ప, ఉమ్మడి మండలాల బిఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా పాలన చేతకాకే ప్రజా నాయకుడైన కేసీఆర్ పై ఫోన్ టాపింగ్ పేరుతో ఇబ్బందులకు గురిచేయాలని చూస్తుందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ నాగర్ కర్నూల్ జిల్లాలో బిఆర్‌ఎస్ పార్టీ నిరసనగళం వినిపించింది. మండలాల వారిగా ప్రధాన కూడళ్ల వద్ద నల్ల బ్యాడ్జీలు, నల్ల కండువాలు, జెండాలతో నిరసన చేపట్టారు. జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి బొమ్మను దగ్ధం చేశారు. బిఆర్‌ఎస్ నేతలు సైతం హంగామా చేశారు. ఈ క్రమంలో కొ ద్దిసేపు పోలీసులతో వావివాదం జరిగింది. కల్వకుర్తి అచ్చంపేట కొల్లాపూర్, ఊరుకొండ, వంగూర్, వెల్దండ వంటి మండల కేంద్రాల్లో పార్టీ కార్యకర్తలు ప్రధాన రహదారుల వెంట నిరసన చేపట్టారు.