02-02-2026 12:17:57 AM
కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం
కరీంనగర్ క్రైం, జనవరి1(విజయక్రాంతి): కరీంనగర్ కమీషనరేట్ పరిధిలో భద్రత కారణాల దృష్ట్యా పారాగ్లైడర్స్, రిమోట్ కంట్రోల్ డ్రోన్స్, రిమోట్ కంట్రోల్ మైక్రోలైట్ ఏయిర్ క్రాఫ్ట్ ల వినియోగాన్ని నిషేదించడం జరిగిందని కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిషేదాజ్ఞలు ఈనెల 28 వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.పైన పేర్కొన్న సాంకేతిక పరికరాలను ఈ మధ్యకాలంలో వివాహాది శుభకార్యాలు, వివిధ కార్యక్రమాల సందర్భంగా వినియోగించబడుతున్నాయని తెలిపారు.
ఉగ్రవాదులు, అసాంఘికశక్తులు వీటిని వినియోగించే అవకాశాలుండటంతో సదరు సాంకేతిక పరికరాల వినియోగాన్ని నిషేదించడం జరిగిందని తెలిపారు. ఎవరైనా వినియోగించదలచినట్లయితే సంబంధిత పోలీసుల అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఐపిసి సెక్షన్ 188 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.